May 27, 2026
Explore
పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్.. నగదు స్వాధీనం

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్.. నగదు స్వాధీనం

May 27, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని చక్రాలమడుగు కంపచెట్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ మనోజ్ రామనాధ్ హెగ్డే సూచనల మేరకు మంగళవారం సాయంత్రం రాజంపేట అర్బన్ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి రూ.3,620 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట అర్బన్ సీఐ బి.నాగార్జున తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags;Six arrested for playing cards; cash seized.