సంబేపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో బుధవారం ఉదయం ఒక దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సంబేపల్లి మండలం అడవికమ్మపల్లె సమీపంలోని నర్సా రెడ్డి గారి పల్లెలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఒక కూలీ పక్కన అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఆ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి ఉపాధి కూలీలు వెంటనే స్పందించి, బాధితుడిని హుటాహుటిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags: Lightning Strike During Employment Works: Laborer Seriously Injured