గువ్వలచెరువు ముచ్చట్లు:
గువ్వలచెరువు ఘాట్ రోడ్డుపై ప్రమాదవశాత్తు రోడ్డుకు అడ్డంగా పడిపోయిన గ్యాస్ ట్యాంకర్‌ను పోలీసులు, ఫైర్ సిబ్బంది విజయవంతంగా బుధవారం సాయంత్రం తొలగించారు. భారీ క్రేన్ సహాయంతో ఎంతో శ్రమించి ట్యాంకర్‌ను పక్కకు లేపారు. గ్యాస్ ట్యాంకర్ అడ్డంగా పడటంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే, లీకేజీ ప్రమాదం ఏమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరికాసేపట్లో ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను యధావిధిగా పునరుద్ధరిస్తామని పోలీసులు వెల్లడించారు.
Tags: Gas Tanker Blocking Guvvalacheruvu Ghat Road Removed