May 27, 2026
Explore
జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి – జేసీ

జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి – జేసీ

May 27, 2026 | Andhra Pradesh

నిమ్మనపల్లి ముచ్చట్లు:

నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పనుల పురోగతి, నాణ్యతను తనిఖీ చేసిన ఆయన.. భూగర్భ జలాల సంరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం నిమ్మనపల్లిలోని బహుదా డ్యాంను సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యం, కాలువల పరిస్థితిని సమీక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags; Jaladhara works must be completed quickly and with high quality — JC