చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇంచార్జ్ అడ్మిన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు కి రాష్ట్ర ప్రభుత్వం నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సమర్థవంతమైన సేవలు అందిస్తూ, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథం మరియు పరిపాలనా నైపుణ్యంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో సమర్థంగా నిర్వహిస్తూ శాఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలకు గాను నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి ఇవ్వడం పట్ల జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు కి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Tags:Additional SP S.R. Rajasekhar Raju promoted as Non-Cadre SP.