పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని ప్రైవేటు బస్టాండ్, మున్సిపల్ బస్టాండ్‌లో గల ఖాళీ స్థలాలు, షాపురూములు జూన్ 5న వేలం వేయనున్నట్లు కమిషనర్ మధుసూధన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు వేలంపాటను నిర్వహిస్తామన్నారు. నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి, ఆసక్తి గల వ్యాపారులు వేలంపాటలో పాల్గొనాలని కోరారు.
Tags: Municipal Auctions on June 5th