May 27, 2026
Explore
నేడు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ

నేడు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన, పార్టీ కమిటీల నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:YS Jagan Meets with Key Party Leaders Today