May 27, 2026
Explore
జూన్ 10 తర్వాతే AP EAPCET ఫలితాలు

జూన్ 10 తర్వాతే AP EAPCET ఫలితాలు

May 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ ఈఏపీసెట్ (EAPCET) ఫలితాలను జూన్ 10వ తేదీ తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఈఏడాది ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలురాసే అవకాశం ఇవ్వగా, అవి జూన్ 5తో ముగియనున్నాయి. ఈఏపీసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో పరీక్షలు పూర్తయ్యే వరకు ఆగాలి. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ వెయిటేజీని పూర్తిగా తొలగించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

Tags: AP EAPCET results only after June 10.