గుంటూరు ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా 1875 క్లస్టర్ కేంద్రాల్లో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానున్నారు.పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ, త్యాగం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానాడు ఈసారి మరింత ప్రత్యేకంగా జరగనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా క్లస్టర్ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు, చర్చలు, తీర్మానాలు చేపట్టనున్నారు.పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మహానాడును పండుగలా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, అలంకరణలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొల్పేలా రెడీ అవుతుంది.
Tags: All Set for Mahanadu Tomorrow; Enthusiasm Sweeps Across TDP Ranks Statewide.