May 26, 2026
Explore
రెండవ పెళ్లి చేయలేదని ఆత్మహత్య

రెండవ పెళ్లి చేయలేదని ఆత్మహత్య

May 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

తొలిభార్య మరణించడంతో రెండవ పెళ్లి చేయమని కోరిన తల్లిదండ్రులు స్పందించకపోవడంతో మనస్థాపానికి గురై యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బోడేవారిపల్లెలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన మనోహర్‌కు గతంలో వివాహామైంది. భార్య మృతిచెందింది. ఒంటరిగా ఉన్న మనోహర్‌ తనకు రెండవ పెళ్లి చేయాలంటు తల్లిదండ్రులను కోరాడు. వారు అంగీకరించకపోవడంతో ఇంట్లో పురుగుల మందుతాగాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే మనోహర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Suicide due to second marriage