పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో ప్రతియేటా జరిగే రీతిలో సోమవారం రాత్రి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులందరు కలసి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంత సుఖసంతోషాలతో ఉండాలని ఏటా నిర్వహించడం ఆనవాయితీ. లింగదారుణ నృత్యప్రదర్శనలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గ్రామస్తులందరు జాగరణ చేసి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు.
Tags: Procession of Lord Veerabhadra in Kummaragunta