May 26, 2026
Explore
ఆశీర్వాదాలు, పరామర్శలతో పెద్దిరెడ్డి బిజి…బిజి

ఆశీర్వాదాలు, పరామర్శలతో పెద్దిరెడ్డి బిజి…బిజి

May 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలో పెద్దిరెడ్డి పర్యటనలో జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, మాజీ ఎంపి రెడ్డెప్ప కలసి నూతన దంపతులను ఆశీర్వధించారు. మృతి చెందిన పలువురి ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమ కుమారుడు రాజ్‌వినీత్‌, విజిత దంపతులను ఆశీర్వధించారు. అలాగే రాంపల్లెలో పార్టీ నాయకుడు వెంకట్రమణ దంపతులను ఆశీర్వధించారు. ఉలవలదిన్నెలో కె.వెంకట్రమణ దంపతులను ఆశీర్వధించారు. మంగళం గ్రామంలో బాబు దంపతులను ఆశీర్వధించారు. జౌకొత్తూరులో వెంకట్రమణ దంపతులను ఆశీర్వధించారు. అలాగే ఇటీవల మృతి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వాహిద్దున్నిసా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతగేటులో మృతి చెందిన పద్మనాభం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుల్తాన్‌సాబ్‌వీధిలో ముస్లింనాయకుడు రఫిక్‌ అల్లుడు మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే పార్టీనాయకుడు ఖాజా తండ్రి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, జింకా వెంకటాచలపతి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి, నాయకులు కిజర్‌ఖాన్‌, ఖాదర్‌, రాజేష్‌, సురేష్‌, నజీర్‌, అస్లాంమురాధి, అమ్ముకుట్టి, మమ్ము, నయాజ్‌, అయాజ్‌, రఫిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags: Peddireddy Kept Busy with Blessings and Condolence Visits