May 26, 2026
Explore
ఏపీలో వింత వాతావరణం

ఏపీలో వింత వాతావరణం

May 26, 2026 | Andhra Pradesh

: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు

అమరావతిముచ్చట్లు:

ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న వడగాల్పుల ప్రభావం

ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం

మొత్తం 163 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన

ఏపీ నిప్పుల కుంపటిలా మండిపోతోంది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఓవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరనున్నాయి. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Tags: Strange Weather in AP