అమరావతిముచ్చట్లు:
భానుడి ఉగ్రరూపంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 25 మంది,
తెలంగాణలో 52 మంది చొప్పున మొత్తం 77 మంది మృతి చెందారు.
మరోవైపు రాబోయే రోజుల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మధ్యాహ్న వేళల్లో వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
Tags:Heatwave Toll: 77 Dead in a Single Day Yesterday