సిద్ధవటం ముచ్చట్లు:
సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నీలకంటేశ్వర స్వామి గుడి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనాలలో అత్యవసర వైద్య చికిత్సల కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Lorry-Private Bus Collision; Several Injured