మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. కాట్లాటపల్లె రోడ్డుకు చెందిన శ్రీనివాసులు భార్య సరస్వతి (40) సోమవారం ఆర్టీసీ బస్సెక్కి గుర్రంకొండకు బయలుదేరింది. ప్రయాణంలో ఆమె బస్సు డోర్ వద్ద నిలబడగా, మదనపల్లె రింగురోడ్డు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు పట్టుతప్పి రన్ అవుతున్న బస్సు నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే స్పందించి బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Tags: Woman Sustains Severe Injuries After Falling from Bus