May 26, 2026
Explore
కువైట్‌లో పని చేయించుకుని రూ.3 లక్షలు ఎగ్గొట్టారు

కువైట్‌లో పని చేయించుకుని రూ.3 లక్షలు ఎగ్గొట్టారు

May 26, 2026 | Andhra Pradesh

: ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు

కువైట్‌ ముచ్చట్లు:

కువైట్‌లో రెండేళ్ల పాటు తన వద్ద పని చేయించుకుని, రూ.3 లక్షలకు పైగా డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని ఓ బాధితుడు సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ (స్పందన) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం గంజివారిపల్లికి చెందిన శ్రీహరి ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తన వద్ద పని చేయించుకుని, ఇవ్వాల్సిన రూ.3 లక్షల వేతనాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని వేడుకున్నాడు.

Tags; They had work done in Kuwait and defaulted on a payment of ₹3 lakhs.