కురబలకోట ముచ్చట్లు:
భార్యపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన సోమవారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి స్థానిక పాల డైరీలో పనిచేస్తున్నాడు. అయితే, అత్తమామలు తనను రోజూ వేధిస్తున్నారని భార్య అంజలి (23) భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త పురుషోత్తం రెడ్డి ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ దారుణంపై బాధితురాలు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Tags; Husband attacks wife with a knife for questioning him about harassment by his in-laws.