పీటీఎం ముచ్చట్లు:
మిద్దెపై నుంచి జారిపడి ఓ బాలిక తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం పీటీఎం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమార్తె స్వాతి (12) మిద్దెక్కి పూలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు పట్టుతప్పి పైనుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి బాధితురాలిని 108 వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Tags: Girl Sustains Severe Injuries After Falling from Terrace