బాధితురాలి ఆవేదన
రామసముద్రం ముచ్చట్లు:
అదనపు కట్నం కోసం గర్భిణీ అని కూడా చూడకుండా భర్త తనను ఇంటి నుంచి గెంటివేశాడని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ (స్పందన) కార్యక్రమంలో ఆమె ఎస్పీని కలసి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. రామసముద్రం మండలం గజ్జిగంగన్నపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం తనను గర్భిణీ అని కూడా కనికరం లేకుండా, అదనపు కట్నం తీసుకురావాలంటూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని కన్నీరుమున్నీరయ్యారు.
Tags: Disregarding the fact that she was pregnant, they threw her out of the house for additional dowry.