May 26, 2026
Explore
పది రోజుల్లో నాలుగు సార్లు బాదుడా?.

పది రోజుల్లో నాలుగు సార్లు బాదుడా?.

May 26, 2026 | Andhra Pradesh

. ఇంధన ధరలు తగ్గించాల్సిందే: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

అమరావతిముచ్చట్లు:

పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచుతూ కూటమి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పది రోజుల్లోనే నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచి.. పెట్రోల్‌పై రూ.7.79, డీజిల్‌పై రూ.7.81 భారం మోపారని మండిపడ్డారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే ఇంధన ధరలు ఉన్నాయని విమర్శించారు. పెంచిన పన్నులను వెంటనే తగ్గించకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

tags: Four price hikes in just ten days?