మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుండి 393 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్, రెవెన్యూ క్లినిక్ అర్జీలను అధికారులు ప్రత్యేక దృష్టితో, గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. పింఛన్ల కోసం బసినికొండకు చెందిన కస్తూరి, రామాచార్లపల్లికి చెందిన శారదలు జేసీకి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Tags:Petitions must be resolved with quality and within the deadline: JC