May 26, 2026
Explore
బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ ధీరజ్

బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ ధీరజ్

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, వికలాంగుల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు.

Tags; The Goal is to Deliver Speedy Justice to Victims: District SP Dheeraj