: సీపీఐ నేత కె. మురళి ఆరోపణ*
గాలివీడు ముచ్చట్లు:
గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లి రైతు పుల్లారెడ్డికి ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాలని కోరుతూ సీపీఐ నేతలు జేసీకి అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ.. డబ్బు చెల్లించి, శాంక్షన్ అయినా విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడం లేదన్నారు. సర్పంచ్ పర్మిషన్ తెచ్చుకోవాలని అధికారులు అంటుంటే.. తమ పార్టీ కండువా వేసుకుంటేనే వన్డేలో ఫిట్ చేయిస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పీజీఆర్ఎస్ అర్జీలను అధికారులు చెత్తబుట్టలో వేస్తున్నారని మండిపడ్డారు.
Tags: Will you install a transformer only if one wears the party scarf?