May 26, 2026
Explore
ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ పావని

ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ పావని

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం సోదరులు పరస్పర ఐకమత్యం, సమన్వయంతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ, తాలూకా సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags; Bakrid Festival Should Be Celebrated Peacefully and in Unity: DSP Pavani