May 26, 2026
Explore
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే

May 26, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులతో మమేకమై రూ. 4,10,000 విలువైన చెక్కులను అందజేశారు. నేరుగా తమ ఇళ్ల వద్దకే వచ్చి సాయం అందించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు హర్షం వ్యక్తం చేశారు.

Tags: Madanapalle MLA visits beneficiaries’ homes to distribute CMRF cheques.