May 26, 2026
Explore
మదనపల్లి జిల్లా సాధన పోరాటంపై అక్రమ కేసులు

మదనపల్లి జిల్లా సాధన పోరాటంపై అక్రమ కేసులు

May 26, 2026 | Andhra Pradesh

.. కోర్టుకు హాజరైన టీడీపీ నేతలు

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లె జిల్లా సాధన కోసం గతంలో నిరసనల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం మదనపల్లె కోర్టు వాయిదాకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, సీనియర్ నేత రాటకొండ మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్ తదితరులు మాట్లాడారు. నాడు జిల్లా కోసం పోరాడితే అప్పటి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని వాపోయారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెలా తాము కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: False Cases Filed Over the Struggle for a Madanapalle District