May 26, 2026
Explore
మొలకలదిన్నెలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.

మొలకలదిన్నెలో ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.

May 26, 2026 | Andhra Pradesh

. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ లక్ష్యం*

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మండలం మొలకలదిన్నెలో రూ.15.25 కోట్లతో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యంతో పరిశ్రమలకు 45 శాతం వరకు రాయితీలు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మదనపల్లిలో త్వరలోనే 50 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు, 30 ఏళ్ల కల అయిన ఆటోనగర్ ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags: Groundbreaking ceremony for the factory complex in Molakaladinne.