May 24, 2026
Explore
నాణ్యతలేని విద్యుత్‌ స్తంభాలు

నాణ్యతలేని విద్యుత్‌ స్తంభాలు

May 24, 2026 | Andhra Pradesh

లైన్లు లాగిన , వాహనాలు గుద్దిన ధ్వంసం

పుంగనూరు ముచ్చట్లు:

విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్షంతో నాణ్యత లేని విద్యుత్‌ స్తంభాలను గ్రామీణ ప్రాంతాలలో వినియోగిస్తున్నారు. ఆప్రాంతంలో వాహనాల రాకపోకలతో పొరపాటున స్తంభాలను ఢీకొన్న, లేదా లైన్లు లాగే సమయంలో సిబ్బంది గట్టిగా లాగీన స్తంభాలు విరిగిపోతున్న సంఘటన పుంగనూరు డివిజన్‌లో జరుగుతోంది. పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లె రహదారిపై మాదనపల్లె వద్ద వాహనం ఢీకొనడంతో రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయింది. ఒక స్తంభాన్ని ఢీకొంటే వంద మీటర్లలో ఉన్న మరో స్తంభం కూడ విరిగిపోవడం స్తంభాల నాణ్యతను సూచిస్తోంది. అలాగే మాదనపల్లె నుంచి చింతలపల్లెకి వెళ్లే మార్గ మధ్యంలో మూడు స్తంభాలు విరిగిపోయింది. నిబంధనల మేరకు కమ్మి, సిమెంటు వినియోగించకపోవడంతోనే స్తంభాలు విరిగిపోతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే మాదనపల్లె వద్ద ప్రమాదం జరిగి రెండు నెలలు గడుస్తున్న, విద్యుత్‌ వైర్లు క్రిందకు వ్రేలాడుతున్న మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిద్ర మత్తులో ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇకనైన అధికారులు స్పందిస్తారా..? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags: Substandard Electric Poles