May 24, 2026
Explore
వరుస కథనాలతో కదలిన యంత్రాంగం

వరుస కథనాలతో కదలిన యంత్రాంగం

May 24, 2026 | Andhra Pradesh

చెరువుకట్టపై తార్‌రోడ్డు

పుంగనూరు ముచ్చట్లు:

ఎట్టకేలకు పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి పుంగమ్మ చెరువు కట్టపై పనులను అధికారులు ప్రారంభించారు. ఆదివారం తారువేసే కార్యక్రమం చేపట్టారు. కాగా గత నాలుగు నెలలుగా రోడ్డును మరమ్మతులు చేయకపోవడంతో వాహనాల రాకపోకలతో దుమ్మురేగి పట్టణంలోని ఇండ్లపై పడుతోందని , ప్రజలు ఆనారోగ్యం భారీన పడుతున్నారంటు తెలుగుముచ్చట్లులోవెబ్‌సైట్‌నందు దుమ్ముకొట్టారు అన్న శీర్షికలతో వరుస కథనాలను ప్రచురించడం పాఠకులకు విధితమే. దీనిపై ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి చెరువుకట్టపై తారురోడ్డు పనులు చేపట్టారు. కాగ అరవపల్లె రోడ్డు నుంచి రోడ్డును మరమ్మతుల పేరుతో పెరికివేశారు. సాక్షి కథనాలతో ప్రజలు చైతన్యవంతులై ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం పనులు చెరువుకట్టపైనే చేసి ఆపివేస్తారా..? లేక అరవపల్లె వరకు పూర్తి చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. రోడ్డు మరమ్మతులపై సకాలంలో స్పందించిన తెలుగుముచ్చట్లులోవెబ్‌సైట్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Tags: The machinery sprang into action following a series of reports.