తిరుపతి ముచ్చట్లు:
-
- తిరుపతి జిల్లాలోని సుమారు 450 మంది రౌడీ షీటర్లు, గంజా మరియు పోక్సో కేసులో ముద్దాయిలకు మెగా కౌన్సెలింగ్ మరియు సామూహిక ప్రతిజ్ఞ.
- చట్టానికి లోబడి నడుచుకుంటే గౌరవిస్తాం, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం విలువ తెలియజేస్తాం.
- సత్ప్రవర్తన తో మెలిగితే సరి…లేదా తాట తీస్తాం…జిల్లా ఎల్ సుబ్బారాయుడు.,.,
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లో నేరాలకు, నేరస్థులకు చోటు లేదు.
- ఆధ్యాత్మిక నగరంలో నేర రహిత, గంజాయి రహిత జిల్లా ఏర్పాటు ప్రధాన లక్ష్యం.
- చట్టాన్ని చేతిలోకి తీసుకొని పదే పదే నేరాలలో పాల్గొన్న- 13 మంది పై PD యాక్ట్ నమోదు.
- గంజాయి కేసులలో పదే పదే ఉన్న వాళ్ల పైన 17 మంది పైన PITNDPS క్రింద నమోదు.
- నేరస్తులకు చివరి హెచ్చరిక – మారకుంటే జిల్లా బహిష్కరణ కి కూడా వెనుకాడే ప్రసక్తే లేదు.
- రౌడీయిజం, గంజాయి, మహిళలపై నేరాలకు తిరుపతి జిల్లాలో నో టాలరెన్స్
- పవిత్ర తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసే వారిపై ఉక్కుపాదం.
- “మారితే ఆదరిస్తాం… మళ్లీ నేరం చేస్తే చట్టం ఎలా వుంటుందో చూపిస్తాం” – జిల్లా ఎస్పీ.
- గంజాయి వినియోగదారులు, సరఫరాదారులపై ప్రత్యేక నిఘా ఆధునిక టెస్టింగ్ వ్యవస్థ.
- తిరుపతిని శాంతియుత, సురక్షిత జిల్లాగా మార్చడమే పోలీసుల లక్ష్యం.
- మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీ లేదన్న జిల్లా పోలీస్ శాఖ.
- ప్రజల భరోసానే పోలీసుల బలం – నేరస్థుల్లో భయం సృష్టించే కఠిన చర్యలు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, గంజాయి కేసుల్లో నిందితులు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు, పోక్సో కేసుల ముద్దాయిలకు ప్రత్యేక మెగా కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, నేరస్థుల్లో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమానికి సుమారు 450 మంది హాజరయ్యారు. వీరిలో రౌడీ షీటర్లు, గంజాయి విక్రేతలు మరియు వినియోగదారులు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు, ముఖ్యంగా మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన పోక్సో నిందితులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 257 NDPS షీట్లు, 184 POCSO షీట్లు ఓపెన్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అలాగే 13 మంది రౌడీ షీటర్ల పైన PD యాక్ట్ , గంజాయి మరియు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 17 మందిపై PITNDPS Act నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తీవ్ర స్వరంతో మాట్లాడుతూ, “తిరుపతి వంటి పవిత్ర ప్రాంతంలో రౌడీయిజం, గంజాయి, మహిళలపై నేరాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయితే ప్రతి కదలికపై పోలీసుల నిఘా ఉంటుంది. మళ్లీ నేరాలకు పాల్పడితే PD Act, Externment వంటి కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
అలాగే “మార్పు చెందితే పోలీస్ శాఖ మీకు అండగా ఉంటుంది. కానీ ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించేందుకు వెనుకాడం” అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో గంజాయి వినియోగాన్ని గుర్తించే ఆధునిక యూరిన్ టెస్ట్ విధానంపై అవగాహన కల్పించారు. ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో యూరిన్ టెస్ట్ ద్వారా గంజాయి వినియోగాన్ని గుర్తించవచ్చని, గత 30 రోజుల వరకు వినియోగ చరిత్ర బయటపడుతుందని చెప్పారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి ద్వారా గంజాయి సరఫరా గొలుసును గుర్తించి మూలాలను పూర్తిగా అణచివేస్తామని హెచ్చరించారు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, నేర నియంత్రణ విషయంలో అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణం కల్పించడం తమ బాధ్యత అని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు (పరిపాలన), అదనపు ఎస్పీ రవిమనోహర చారి (శాంతి భద్రతలు),అదనపు ఎస్పీ శ్రీనివాస్ (క్రైమ్స్),అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు (సాయుధ దళం),డియస్పీ లు , భక్త వత్సలం , గీతా కూమారి(ఎస్బి), శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్) సిఐలు, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags: Mega-Counseling for Rowdy-Sheeters and Accused in Ganja and POCSO Cases