గుంటూరు ముచ్చట్లు:
గుంటూరులో నవ్యశ్రీ వారాహి కన్సల్టెన్సీ నిర్వాకం…
తప్పు పూర్ణచంద్రరావుది… కాదు… అత్యాశ పడిన వారిదే….
గుంటూరు అరండల్ పేట పదహారవ లైన్ లో కార్యాలయం ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన ప్రకటనలు చేసిన అన్నం వెంకట పూర్ణచంద్రరావు..!
రూ.లక్ష కడితే ఇరవై నెలలపాటు నెలకు పదివేల చొప్పున చెల్లిస్తానని ఆఫర్..!
షేర్ మార్కెట్ బిజినెస్ లో తనకు ఎంతో పట్టు ఉందని.. భారీగా లాభాలు గడించవచ్చని ఆశ చూపిన పూర్ణచందర్ రావు…! నష్టాలు లాభాల బాధ్యత తనదే అని.. క్రమం తప్పకుండా డబ్బులు చెల్లిస్తానంటూ చెక్కులు బాండ్లు ఇచ్చిన పూర్ణ..!
గత ఇరవై నెలలుగా కొంతమంది డిపాజిట్ దారులకు క్రమం తప్పకుండా పేమెంట్ చేసిన పూర్ణ..!
డిపాజిట్లు పెంచుకున్న తర్వాత అసలు రంగు బయటపెట్టిన పూర్ణ..!
ఈ ఏడాది జనవరి నుండి పేమెంట్లు నిలిపివేత..!
మార్కెట్ బాలేదని.. కొంత సమయమివ్వాలంటూ నమ్మించే ప్రయత్నం చేసిన పూర్ణ..!
ఈనెల 13 న కుటుంబంతో సహా పూర్ణచందర్ రావు పరారీ..!
రెండు కోట్లకు పైగా వసూల్ చేసినట్లు చెబుతున్న బాధితులు..!
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు..
ఈ మోసం జరిగింది. అక్కడ ‘నవ్య శ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ’ పేరుతో ఒక ఆఫీసు వెలిసింది. అన్నం వెంకట పూర్ణచంద్రరావు అనే వ్యక్తి మరికొందరితో కలిసి దీనిని ప్రారంభించాడు. సంస్థ తరఫున ఒక స్కీమ్ ప్రకటించాడు. లక్ష రూపాయలు ఇస్తే, వాటితో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మించాడు. ఆ లాభాల్లో నెలకు రూ. 10 వేలు చొప్పున 20 నెలల పాటు చెల్లిస్తామని ఆశ చూపాడు.
నమ్మించి ముంచేశారు : వ్యాపారంలో ఏమైనా నష్టాలు వస్తే ఆ భారం కూడా తానే భరిస్తానని పూర్ణచంద్రరావు చెప్పేవాడు – బాధితులు.
Tags: A Massive Scam: Promising Double the Return on Every Lakh!