చౌడేపల్లి ముచ్చట్లు:
చౌడేపల్లి- పలమనేరు మార్గమధ్యంలోని చిట్రెడ్డి పల్లె సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన జరిగింది. చౌడేపల్లి కు చెందిన సుబ్రహ్మణ్యం, పాపన్నలు కలసి చిట్రెడ్డి పల్లె సమీపంలోని ఓ చెరువులో చేపలు వేటాడేందుకు వెళ్ళారు. చేపలు పట్టుకొని బైక్ పై చౌడేపల్లి కు వెళుతుండగా మార్గ మధ్యలో ముందు వెళ్తున్న ఆటో ఒకసారిగా బ్రేక్ వేయడంతో టూ వీలర్ ఆటోను ఢీకొంది ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం కు కాలు విరిగిపోగా ,పాపన్నకు తలకు తీవ్ర గాయాలైయ్యాయి.గాయపడిన వీరిని చౌడేపల్లి 108 వాహనం ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Two people sustain severe injuries in a road accident.