మూడు రోజుల క్రితం చాగణం గ్రామానికి చెందిన బంకాపురి మణికంఠ(20) అనే యువకుడు కనపడకుండా పోగా అతని మృతదేహం తెలుగుగంగ కాలువలో లభ్యం
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన బంకాపురి మణికంఠ(20) S/O సుబ్బయ్య అనే యువకుడు మంగళవారం సాయంత్రం నుండి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, అనంతరం గాలింపు చర్యల్లో భాగంగా యువకుడు బైక్ జోరెపల్లి తెలుగు గంగ కాలువ సమీపంలో ఉన్నట్టు గుర్తించి కాలువ వెంబడి వెతకగా రెండు రోజుల తర్వాత మణికంఠ మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించడంతో మృతదేహాన్ని వెలికి తీసి గురువారం పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు .. మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Dead body found in Telugu Ganga Canal.