. స్థానికులు వచ్చేసరికి చెట్ల పొదల్లో దారుణస్థితిలో యువతి..
అమరావతిముచ్చట్లు:
ప్రేమ పేరుతో మొదలైన బంధం, అనుమానం అనే పిశాచంతో ఎంతటి దారుణానికి దారితీస్తుందో చెప్పడానికి కాపులుప్పాడ ఘటన ఒక నిదర్శనం. వివాహేతర సంబంధం ముసుగులో ఒక ప్రియుడు తన ప్రేయసిని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి..
కొమ్మాది వైఎస్సార్ కాలనీకి చెందిన 32 ఏళ్ల యువతికి, అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ (31)తో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఈ పరిచయం కాలక్రమేణా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఈ బంధం ఎప్పుడూ ప్రశాంతంగా సాగలేదు. కార్తీక్ నిరంతరం ఆమెను అనుమానిస్తూ, వేధింపులకు గురిచేసేవాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరిద్దరి మధ్య గొడవలు తరచూ జరుగుతుండేవి.ఈ క్రమంలోనే బుధవారం రాత్రి, కార్తీక్ ఆమెను కాపులుప్పాడ ప్రాంతంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిపించాడు. అక్కడ మాటామాటా పెరగడంతో, కార్తీక్ తనతో తెచ్చుకున్న జీఐ (GI) వైర్‌ను ఉపయోగించి ఆమె గొంతును బిగించాడు. ఊపిరి ఆడక ఆమె కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న కార్తీక్, అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు అటు వైపు రాకపోతే..
ఆ యువతి అదృష్టం బాగుండి, పొదల్లో కొన ఊపిరితో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాధితురాలిని చికిత్స నిమిత్తం గీతం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. అనుమానం పెనుభూతమై అమాయక ప్రాణాలను బలిగొనాలని చూడటం అత్యంత హేయమైన చర్య. ప్రియమైన వారిపై నమ్మకం లేని బంధం, చివరికి ఇలాంటి విషాదకరమైన ముగింపునకు దారితీస్తుంది.
Tags; Man takes girlfriend into forest and sexually assaults her.