May 22, 2026
Explore
హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

May 22, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

యడ్లపాడు మండలం ఎర్రకొండ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు.

Tags: Man dies after being struck by unidentified vehicle while crossing highway.