పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి కి బెంగళూరు ఐటీ వింగ్ ప్రతినిధులు, అభిమానులు ఘనంగా సన్మానం చేశారు. ఆదివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చెంగారెడ్డి ని కలిసి, ఆయన పార్టీకి మరియు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా బెంగళూరు ఐటీ వింగ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు మరియు వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా యువతను మరియు ఐటీ నిపుణులను ఏకం చేయడంలో చెంగారెడ్డి చూపిస్తున్న చొరవ అభినందనీయమని వారు పేర్కొన్నారు.వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ అభ్యున్నతికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమ వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఐటీ వింగ్ ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: Grand Felicitation for YSRCP State Youth Wing Secretary Chengareddy