లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లెలో వేంపల్లి-రాయచోటి జాతీయ రహదారికి అడ్డంగా ఉన్న ఇళ్లు, దుకాణాలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ క్రాంతికుమార్ సూచించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం ఇప్పటికే చెల్లించామని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలు మినహా రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. లేకపోతే ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు తొలగింపు చర్యలు చేపడతారని హెచ్చరించారు. గ్రామ ప్రజలు సహకరించి వెంటనే ఇళ్లు, దుకాణాలు తొలగించాలని కోరారు.
Tags: Houses and shops obstructing the National Highway must be removed.