May 17, 2026
Explore
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ

అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ

May 17, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

చిత్తూరు ఈస్ట్, వెస్ట్, రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, నెల్లూరు అటవీ శాఖ డివిజన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేపటి నుంచి (సోమవారం ) అధికారిక షాప్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు – 4 పోస్టులు

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (గార్డ్స్) – 6 పోస్టులు

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు (వాచర్స్) – 4 పోస్టులు

అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలని సూచించారు.

Tags; Recruitment in the Forest Department