అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా మే 20న మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్‌తో పాటు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఈ-ఫార్మసీల నిర్వహణ, ఆన్‌లైన్‌లో యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా విక్రయించడం, ఏఐతో నకిలీ ప్రిస్క్రిప్షన్ల సృష్టి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.
Tags: Medical Shops Closed on May 20