తిరుపతి ముచ్చట్లు:
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు.
- వాహనాల తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తులను పరిశీలించిన పోలీసులు.
- రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా.
- ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహణ.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్, వెస్ట్,ఆలిపిరి,తిరుపతి రూరల్, వడమాలపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు ఉదయం పోలీసులు ఆకస్మికంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానిత వ్యక్తులను పరిశీలించారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు.
- శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డైల్ 112 కి సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
Tags; Conducting a surprise cordon and search operation as part of visible policing.