తిరుపతి ముచ్చట్లు:
- ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా తిరుమలలో విస్తృత స్థాయి నాఖాబందీ నిర్వహణ.
- పలు శాఖల సమన్వయంతో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ.
- అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక తనిఖీలు.
- తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా తిరుమలలో విస్తృత స్థాయిలో నాఖాబందీ కార్యక్రమం నిర్వహించారు.
- భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమలలోని శిలాతోరణం, శ్రీవారి పాదాలు ప్రాంతాల్లో ఉదయం 6.00 గంటల నుండి 7.30 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కార్యక్రమానికి ముందు ఉదయం 5.30 గంటలకు శిలాతోరణం జంక్షన్ వద్ద సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు.
- ఈ నాఖాబందీ కార్యక్రమంలో పోలీస్ శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్, ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఫైర్ సర్వీసెస్, టీటీడీ రెవెన్యూ, రెవెన్యూ శాఖ, బాంబ్ డిస్పోజల్ టీమ్స్, ఎక్సైజ్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
- ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
- ప్రజలు, భక్తులు పోలీస్ శాఖకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Tags: The primary objective is the safety of devotees and the maintenance of law and order.