విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. కన్న కొడుకే కసాయిగా మారి తల్లిని హత్య చేసి చెరువులో పడేశాడు. 16 ఏళ్లు కూడా లేని కొడుకును బుద్దిగా చదువుకోమని చెప్పినందుకే ఈ దారుణానికి పాల్పడ్డాడు. డోలపేటకు చెందిన ముంజేటి స్పందన ఈనెల 4న హత్యకు గురయ్యారు. ఇంటి పక్కనున్న చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. అప్పటికే 16 ఏళ్ల కొడుకు కుమారుడు అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు స్పందన మృతిపై రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా కుమారుడి అదృశ్యం, ఇంట్లోని బంగారం మాయం కావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ముంబైకి పారిపోయి, అక్కడ మాఫియా గ్యాంగులతో చేరాలని భావించాడు. మరో స్నేహితుడితో కలిసి, తల్లిని చేసి ఆమె నగలు తీసుకెళ్లాడు. తిరుపతిలో పోలీసులు వాడిని, వాడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Tags: The Brutal Son Who Murdered His Mother