విశాఖ ముచ్చట్లు:
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి. జూన్ 1 నుంచి 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా జోన్ అధికారికంగా అమల్లోకి రానుంది. దీంతో 18 నక్షత్రాలతో కూడిన కొత్త లోగోను రైల్వేబోర్డు విడుదల చేసింది.
Tags: Indian Railways logo with 18 stars