బిహార్ ముచ్చట్లు:
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి సాహసం అందరినీ కంటతడి పెట్టించింది.
ఇద్దరు పిల్లలతో ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది.
తప్పించుకునే దారి లేకపోవడంతో, ఆమె పిల్లలను హత్తుకుని ప్లాట్‌ఫామ్‌కు, ట్రాక్‌కు మధ్య ఉన్న ఇరుకైన సందులో పడుకుంది.
రైలు వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలను కాపాడుకుంది.
ఈ ఘటనలో ముగ్గురూ సురక్షితంగా బయటపడగా, అక్కడ వంతెన లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags: A mother who risked her life for the sake of her children…