May 15, 2026
Explore
17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం…

17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం…

May 15, 2026 | Andhra Pradesh

కొద్ది రోజులు పెళ్లిళ్లకు సెలవ్..

అమరావతిముచ్చట్లు:

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో అధిక మాసం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా శుభకార్యాలకు ఈ మాసం నిషిద్ధమని మనందరికీ తెలుసు. అయితే, లౌకిక సుఖాల కంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, దైవచింతనకు ఈ మాసం ఒక వరం వంటిది. “అధికస్య అధికం ఫలం” అన్న నానుడి ప్రకారం.. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా వేయి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. 2026వ సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఏం చేయవచ్చు…ఏం చేయకూడదో తెలుసుకుందాం.

అసలు అధిక మాసం అంటే ఏమిటి?

సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని ‘సంక్రాంతి’ అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో, ఆ మాసాన్ని అధిక మాసం అంటారు. శాస్త్రీయంగా చూస్తే, సౌరమానానికి (365 రోజులు), చాంద్రమానానికి (354 రోజులు) మధ్య ఉండే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి ఒక నెలను అదనంగా చేరుస్తారు. ఇదే అధిక మాసం. పురుషోత్తమ మాసం వెనుక ఉన్న పరమార్థం పురాణాల ప్రకారం, ఈ మాసానికి అధిపతి లేకపోవడంతో దీనిని అందరూ నిరసించేవారట. అప్పుడు శ్రీమహావిష్ణువు కరు

Tags: The Adhika Jyeshtha month begins on the 17th.