May 15, 2026
Explore
వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి

May 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని ఆచార్య ఎన్‌జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల డిప్లామా కోర్సుల్లో అడ్మీషన్లు నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం వైఫై తో పాటు డిజిటల్‌ తరగతులు, ల్యాబ్‌, అత్యధిక సదుపాయాలతో నిపుణులైన అధ్యాపకులతో క్లాసులు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు క్రింది ఫోన్‌ నెంబర్లు : 9381359956, 9010402068 లను సంప్రదించాలని సూచించారు.

Tags: Apply for admissions to the Agricultural Polytechnic College.