పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బోడినాయునిపల్లె సమీపంలో గుర్తుతె లియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామం అటవీప్రాంతానికి దగ్గరగా ఉండటంతో జింకలు తరచుగా తిరుగుతున్నాయి. ఈ సమయంలో జాతీయ రహదారిపైకి జింక రావడంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో జింక అక్కడిక్కడే మృతి చెందింది. దీనిని గమనించి ఆప్రాంత వాసులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి జింకను పోస్టుమార్టంకు తరలించి , దహనక్రియలు నిర్వహించారు.
Tags: Deer killed after being hit by a vehicle.