శ్రీ సత్యసాయి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పుట్టపర్తి పర్యటన ప్రశాంతంగా ముగిసింది.ఈ పర్యటన సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి , జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ఐ పర్యవేక్షణలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్ పరిసరాలు, కాన్వాయ్ మార్గాలు, సభా ప్రాంగణం, వీఐపీ మరియు వీవీఐపీ పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు.భద్రతా విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది.అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడటం జరిగింది.

Tags:Visit of the Chief Minister and the Defence Minister