May 15, 2026
Explore
యూపీలో గాలి దుమారం.. 111కి చేరిన మృతుల సంఖ్య

యూపీలో గాలి దుమారం.. 111కి చేరిన మృతుల సంఖ్య

May 15, 2026 | Andhra Pradesh

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్లో బుధవారం సంభవించిన భారీ గాలిదుమారం, వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ ప్రమాదాల్లోని మరణాల సంఖ్య 111 మందికి చేరగా.. 72 మంది గాయపడ్డారు. ఈ ప్రకృతి వైపరీత్యం ధాటికి 227 ఇళ్లు కూలిపోగా, 170 మూగజీవాలు మరణించాయి. బాధితులను ఆదుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. 26 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags: Dust Storm in UP: Death Toll Rises to 111